![]() |
![]() |

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -78 లో.....గంగ ఎక్కడికి వెళ్ళింది కన్పించడం లేదని పెద్దసారు వాళ్ళు మాట్లాడుకుంటారు. అప్పుడే గంగ వస్తుంది. ఎక్కడికి వెళ్ళావని ఇంట్లో వాళ్ళు అడుగుతారు. ఫ్రెండ్ ని కలవడానికి వెళ్ళానని గంగ చెప్పడంతో ఇషిక ఇండైరెక్ట్ గా గంగతో మాట్లాడుతుంది. వెళ్లి డ్రెస్ చేంజ్ చేసుకొని రెస్ట్ తీసుకోమని ఇషిక అంటుంది. ఆ తర్వాత ఇషిక శకుంతల దగ్గరికి వెళ్లి గంగ ఈ ఇంటికి కోడలుగా వచ్చేలా ఉందని అంటుంది.
ఏం అంటున్నావ్ నువ్వు.. గంగని రుద్ర నాకు దగ్గర కావడం కోసం వాడుకుంటున్నాడని ఇంట్లో నుండి పంపిస్తానన్నానని శకుంతల అంటుంది. మీరే చూడండి అని గంగ పార్క్ వెళ్ల గెటప్ చేంజ్ చేసి రుద్రని కలిసిన వీడియోని శకుంతలకి ఇషిక చూపిస్తుంది. దాంతో శకుంతల షాక్ అవుతుంది. మరొకవైపు ఇషిక ఇంట్లో అందరికి టీవీలో ప్లే చేసి వీడియో చూపిస్తుంది. అందరు అది చూసి షాక్ అవుతారు. రుద్ర కూడా ఆ వీడియో చూస్తాడు. స్నేహ గంగని తీసుకొని రావడానికి గదిలోకి వెళ్తుంది. రుద్ర ఇచ్చిన చాక్లెట్ తింటుంది. అప్పుడే ఒక ఆమె వచ్చి నిన్ను అందరు రమ్మంటున్నారని గంగని తీసుకొని వెళ్తుంది.
గంగ వెళ్లి ఆ వీడియో చూస్తుంది..నేను కాదని మొదట అంటుంది. ఇషిక మొత్తం వీడియో చూపిస్తుంది. దాంతో గంగ టెన్షన్ పడుతుంది. తరువాయి భాగంలో గంగని రుద్ర కొట్టబోయి ఆగిపోతాడు. నిన్ను నమ్మాను.. ఇలా చేస్తావ్ అనుకోలేదని కోప్పడతాడు. శకుంతల కూడా గంగపై కోప్పడుతుంది. గంగ ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |